తూర్పుగోదావరి జిల్లా కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 300మంది దివ్యాంగులకు రూ.3లక్షల విలువైన ఉపకరణాలను పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అందజేశారు. యానాం విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని.. 8, 9, 10 తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి మాస్కులను పంపిణీ చేశారు. సర్వశిక్షా అభియాన్ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. కృత్రిమ అవయవాలు, ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, కళ్ళజోళ్లు అవసరమైన వారిని గుర్తించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా ప్రతియేటా ఉచితంగా ఉపకరణాలు అందజేస్తున్నట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు.
దివ్యాంగులకు ఉపకరణాలు...విద్యార్థులకు మాస్కులు పంపిణీ - eastgodavari district newsupdates
కేంద్ర పాలిత యానాంలో 300మంది దివ్యాంగులకు రూ.మూడు లక్షల విలువైన ఉపకరణాలను పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి అందజేశారు. విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు.
![దివ్యాంగులకు ఉపకరణాలు...విద్యార్థులకు మాస్కులు పంపిణీ Tools for the disabled ... Distribution of masks to students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9806346-35-9806346-1607417303382.jpg?imwidth=3840)