ETV Bharat / state

ARREST: గంజాయితో పట్టుబడ్డ ముగ్గురు యువకులు అరెస్టు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం బైపాస్ రోడ్ లో కొత్తూరు జంక్షన్ వద్ద ముగ్గురు యువకులు గంజాయితో పట్టుబడ్డారు. వారిని రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు.

ARREST
ARREST
author img

By

Published : Sep 26, 2021, 2:52 AM IST

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం బైపాసు రోడ్డులో కొత్తూరు జంక్షన్ వద్ద ముగ్గురు యువకులు గంజాయితో(three youngsters carrying ganja were arrested) పట్టుబడ్డారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై సురేశ్​ బాబు తనిఖీలు నిర్వహించారు. పల్సర్ వాహనంపై వెళుతున్న ముగ్గురు యువకులను ఆపి తనిఖీ నిర్వహించగా.. వారి వద్ద రెండు కేజీల గంజాయిని గుర్తించారు. యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా.. విశాఖ జిల్లా దారా కొండ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొస్తున్నట్లు నిందితులు తెలిపారు. రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

పట్టుబడిన ముగ్గురు యువకులు గంజాయి సరఫరా చేస్తున్న యువతను గుర్తించి.. వారిని పోలీసు స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి గంజాయి జోలికి పోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించనున్నారు. గంజాయితో పట్టుబడిన ముగ్గురు యువకులు మడికి సురేంద్ర, బొమ్మ సతీశ్​, అనూస్ చౌదరి లపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:

Fake PA: మంత్రి పీఏల పేరుతో మోసం.. ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.