తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోపడి అన్నా చెల్లెలు, మరో యువకుడు మృతి చెందారు. మృతులు చిన్నం శిరీష (13), చిన్నం వీర్రాజు (18), గుమ్మడి సన్నీ (18) గా గుర్తించారు. గుమ్మిలేరు నుంచి దోసకాయలపల్లికి ద్విచక్రవాహనంపై వస్తుండగా.. వాహనం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనంపై నలుగురు ప్రయాణించారని పోలీసులు తెలిపారు. ప్రమాదం నుంచి మరో యువకుడు సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి