గోదావరికి మళ్లీ వరద పెరగింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలోని నదీ పాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. పి. గన్నవరం వద్ద వైనతేయ గోదావరి వద్ద వరద పరవళ్లు తొక్కుతోంది.
వరదను వీక్షించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: