తూర్పు గోదావరి జిల్లాలో ఒకేరోజు జరిగిన రెండు ఘటనలు కలకలం రేపాయి. కొత్తపేట, రావులపాలెంలో చోరీలు స్థానికులను భయానికి గురిచేశాయి. వివరాల్లోకి వెళితే... రావులపాలెంలోని ఊబలంక రోడ్డులో పడాల మంగాయమ్మ అనే వృద్ధరాలు ఒంటరిగా జీవిస్తోంది. దీంతో ఆమె నగలు కాజేయాలని చోరులు ప్రణాళిక రచించారు. దీనికి పింఛన్ అధికారులమనే సాకుతో ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె మెడలోని 5 కాసుల బంగారు గొలుసును చోరీ చేశారు. కొత్తపేట మండలం పలివెలలోనూ ఇదే పధకం రిపీట్ అయ్యింది. కొత్తగా పింఛన్ ఇవ్వటానికి వచ్చామని, వివరాలు సేకరించారు. ఫొటో తీయాలని చెప్పారు. మెడలో బంగారం ఉంటే పింఛన్ రాదని నమ్మబలికారు. ఆమె బంగారు తాడు తీసి పక్కన పెట్టిన వెంటనే... దాన్ని తీసుకుని ఉడాయించారు. సీఐ పెద్దిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ: మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం