ETV Bharat / state

ఐదోరోజూ అన్వేషణ...అయినా దొరకని జాడ - boat

గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గురువారం ఒక్కరి ఆచూకీ  తెలియలేదు. బోటు జాడ తెలిసినా... వెలికితీయడం కష్టసాధ్యంగా మారిన వేళ... నిపుణులు, మత్స్యకారుల బృందాలు తర్జనభర్జనపడుతున్నాయి. ముంబయి నిపుణులు నివేదిక ఇచ్చాకే వెలికితీతపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

ఐదోరోజూ అన్వేషణ...అయినా దొరకని జాడ
author img

By

Published : Sep 20, 2019, 5:20 AM IST

పాపికొండల విహార యాత్రలో బోటు మునిగి గల్లంతైనవారి జాడ కోసం ఐదోరోజూ... అన్వేషణ సాగినా ఫలితం లేకపోయింది. ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్ , నౌకాదళం, పోలీసులు, స్థానిక గిరిజనులు, సిబ్బంది ముమ్మరంగా గాలించినా.. ఎవరి ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహాలు నదిలో నుంచి పైకి తేలలేదు. బోటు మునిగిన ప్రాంతంలో దుర్వాసన వస్తుడటంతో...మరికొన్ని మృతదేహాలు ఈ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐదోరోజూ అన్వేషణ...అయినా దొరకని జాడ

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌.. నిపుణుల బృందాలతో కలిసి బోటు మునిగిన ప్రదేశం వద్దకు వెళ్లి పరిశీలించారు. కాకినాడకు చెందిన నిపుణులైన మత్స్యకారుల బృందంతోనూ చర్చలు జరిపారు. నాలుగువైపులా కొక్కేలు వేసి బోటును కనీసం కదిపేందుకైనా అవకాశం ఉందా అన్న అంశంపై చర్చించారు.స్థానిక మత్స్యకారులు బోటు వెలికితీసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఎంపీని కోరగా... ఆయన అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

గోదావరిలో రెండు మృతదేహాలు లభ్యమైనా అవి బోటు ప్రమాదానికి చెందిన పర్యాటకులవి కాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర వేదన చెందారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. బోటు ఎలాగైనా బయటకు తీసి తమవారిని అప్పగించాలని వేడుకుంటున్నారు.

దేవీపట్నం ఎస్సై బోటుకు అనుమతి ఇవ్వలేదని... పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి చెప్పడం వల్లే బోటు ముందుకు కదిలిందని మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ముంబాయి నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే బోటును వెలికితీసే అంశం పరిశీలిస్తామని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీషా తెలిపారు.
ఇదీచదవండి

బోటు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ నియామకం

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్... వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు కు హాజరయ్యే అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు సచివాలయం పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకునేందుకు సంబంధిత అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.గుంటూరు జిల్లా లో ఏర్పాటుచేసిన కేంద్రాలకు వెళ్లేందుకు అభ్యర్థులు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం అంత కిటకిటలాడాయి. దీనికి తోడు వినాయక చవితికి వెళ్లే వారు రావడంతో మరింత రద్దీ పెరిగింది. బస్టాండ్ లో కి బస్సు రాగానే సీట్ల కోసం వారంతా చుట్టుముట్టారు. అధిక సంఖ్యలో బస్సులు లేకపోవడంతో అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు.

Body:విజువల్స్.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.