ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి... దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా సబ్సిడీపై ఉల్లిపాయలను సరఫరా చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ రైతు బజారు వద్ద సబ్సిడీ ఉల్లిపాయల కోసం నగర ప్రజలు బారులు తీరారు. ఉల్లిపాయలు లేనిదే ఏ కూర వండలేం. అయితే తాజాగా ఉల్లి కిలో రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. దీంతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూ.25 కే సబ్సిడీపై ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నారు. రైతు బజార్ ఎస్టేట్ అధికారి రోజి మాట్లాడుతూ.. రేషన్ కార్డు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగి అయితే సంబంధిత ఐడి కార్డు తీసుకొని వస్తే కిలో ఉల్లిపాయలు వారానికొకసారి ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు బజార్ వద్ద ఒకే కౌంటర్ ఏర్పాటు చేశారని మరొక కౌంటర్ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు సరఫరా చేస్తే మిగతావారి పరిస్థితి ఏంటి అని మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఉల్లి కోసం.. రాజమహేంద్రవరం ప్రజల బారులు - The people of Raja Mahendravaram have waiting in que in the farmer's bazaar
ఉల్లికి రెక్కలొచ్చిన వేళ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అందించే సబ్సిడీ ఉల్లిపాయల కోసం రాజమహేంద్రవరం నగర ప్రజలు రైతు బజారులో బారులు తీరారు.
ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి... దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా సబ్సిడీపై ఉల్లిపాయలను సరఫరా చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ రైతు బజారు వద్ద సబ్సిడీ ఉల్లిపాయల కోసం నగర ప్రజలు బారులు తీరారు. ఉల్లిపాయలు లేనిదే ఏ కూర వండలేం. అయితే తాజాగా ఉల్లి కిలో రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. దీంతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూ.25 కే సబ్సిడీపై ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నారు. రైతు బజార్ ఎస్టేట్ అధికారి రోజి మాట్లాడుతూ.. రేషన్ కార్డు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగి అయితే సంబంధిత ఐడి కార్డు తీసుకొని వస్తే కిలో ఉల్లిపాయలు వారానికొకసారి ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు బజార్ వద్ద ఒకే కౌంటర్ ఏర్పాటు చేశారని మరొక కౌంటర్ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు సరఫరా చేస్తే మిగతావారి పరిస్థితి ఏంటి అని మరికొందరు ఆరోపిస్తున్నారు.
Body:వాయిస్ ఓవర్: ఆంధ్రప్రదేశ్లో ఉల్లిపాయలకు కొరత ఏర్పడడంతో వీటి ధరలకు అమాంతంగా రెక్కలు వచ్చాయి బయట మార్కెట్లో ఉల్లిపాయల ధరలు 50 నుంచి 70 రూపాయల వరకు పెరిగిపోయాయి ఉల్లిపాయలు కొనేందుకు సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడింది దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మహారాష్ట్ర కర్నూలు జిల్లాల నుంచి ఉల్లిపాయలు పెద్ద ఎత్తున దిగుమతి చేసి సబ్సిడీ ధరల్లో ప్రజలకు అందిస్తోంది రాష్ట్రవ్యాప్తంగా ఇవాల్టి నుంచి రైతు బజార్ ల ద్వారా సబ్సిడీ లేని ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా విశాఖలోని ఎంవిపి కాలనీ రైతుబజార్ లో సబ్సిడీ ఉల్లిపాయలకు ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరారు బయట మార్కెట్లో కిలో ఉల్లి 50 నుంచి 70 రూపాయలు ధర పలకగా రైతు బజార్ ద్వారా ప్రభుత్వం కిలో ఉల్లిని 25 రూపాయలకే అందిస్తోంది ఒక మనిషికి ఒక కిలో చొప్పున సబ్సిడీ ఉల్లి సరఫరా చేస్తున్నారు మనిషికి ఒక కిలో మాత్రమే ఉల్లిపాయలు ఇవ్వడంపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రెండు కిలోల ఉల్లిపాయలు ఇస్తే బాగుండేది అని తెలిపారు దీంతోపాటు వరుస క్రమంలో నిలబడ్డ వినియోగదారులు నుంచి ఆధార్ గుర్తింపు కార్డు తీసుకొని ఇస్తే బాగుండేదని లేనిపక్షంలో ఒకే మనిషి నాలుగైదు సార్లు వరుసలో నిలబడి సబ్సిడీ ఉల్లిపాయలు తీసుకునే అవకాశం ఉందని కొందరు వినియోగదారుల అభిప్రాయపడ్డారు దీనివల్ల అందరికీ సబ్సిడీ ఉల్లిపాయలు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు
---------
బైట్ జయంతి వినియోగదారు విశాఖ
బైట్ ధనుంజయ రావు వినియోగదారు విశాఖ
---------
వాయిస్ ఓవర్: విశాఖ జిల్లాలో మొత్తం 13 రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ఉల్లిని అందిస్తున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు కాళేశ్వర రావు తెలిపారు జిల్లా వ్యాప్తంగా సుమారు 150 క్వింటాళ్ల ఉల్లిని దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు ఉల్లిపాయల ధరలు తగ్గే వరకు సబ్సిడీ ఉల్లిపాయలు కొనసాగిస్తామని ఆయన చెప్పారు
---------
బైట్ కాళేశ్వరరావు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు విశాఖ
--------- ( ఓవర్).
Conclusion: