తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం సర్పవరం ఆటోనగర్ లోని టైకీ పరిశ్రమను జాతీయ హరిత ట్రైబ్యునల్ బృందం పరిశీలించింది. గత నెల 11న టైకీ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు.
ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ.. వాస్తవాల పరిశీలనకు సంయుక్త నిపుణుల కమిటీ వేసింది. మృతుల కుటుంబీకులతో మాట్లాడిన కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. పరిశ్రమలో తనిఖీలు చేశారు. తమ దృష్టికి వచ్చిన వివరాలపై నివేదిక రూపొందించి.. ట్రైబ్యునల్ కు సమర్పిస్తామని బృంద సభ్యురాలు మహిమ తెలిపారు.
ఇవీ చూడండి: