కోనసీమ ప్రాంతంలోని 276 గ్రామాల్ని..గోదావరి నగరాభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను..హైకోర్టు రద్దు చేసింది. గ్రామీణ పర్యావరణం, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన రైతుని... రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని.. హైకోర్టు స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో 4 పట్టణ స్థానిక సంస్థలు, 236 గ్రామాల్ని.. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అవార్డ్ పరిధిలోకి తెచ్చేందుకు ఈ ఏడాది జనవరిలో తెచ్చిన జీవో 79ని..కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ జీవో..ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ చట్టం-2016 నిబంధనలకు విరుద్ధంగా ఉందని..పిటిషనర్ వాదించారు.
కోనసీమలో భూములు సారవంతమైనవి..ఆ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. గ్రామస్తుల్ని సంప్రదించకుండా, గ్రామసభలు నిర్వహించకుండా గుడాలో చేర్చేందుకు నిర్ణయించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఐతే...ఆ గ్రామాల పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదార్లు వెళుతున్నాయని.... ప్రభుత్వ న్యాయవాది వాదించారు. సారవంతమైన వ్యవసాయ భూముల్ని సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని మరిచిపోతే..భవిష్యత్తు తరాలు క్షమించవని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయ రహదార్లు వెళుతున్నాయనే కారణంతో ఆ గ్రామాలను...గుడా పరిధిలోకి తెస్తామంటే కుదరదన్న హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి: