ETV Bharat / state

యానాంలో కరోనాను జయించిన బాలుడు - carona dishrge news in yanam

యానాంలో మొదటి కరోనా కేసుగా నమోదైన హైదరాబాద్​కు చెందిన 12 ఏళ్ల బాలుడు కరోనాను జయించాడు.

యానాంలో కరోనాను జయించిన బాలుడు
యానాంలో కరోనాను జయించిన బాలుడు
author img

By

Published : Jul 4, 2020, 4:45 PM IST

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 12 ఏళ్ల బాలుడు కరోనాను జయించాడు. గత నెల 15వ తేదీన హైదరాబాద్​ నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడి నుంచి అధికారులు నమూనాలు సేకరించారు. నాలుగు రోజులపాటు ప్రభుత్వ క్వారెంటెన్​లో ఉంచి ఆ తర్వాత హోమ్ క్వారెంటెన్​కు తరలించారు. 20వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గత నెలాఖరున, ఈ నెల రెండో తేదీన జరిపిన పరీక్షల్లో నెగిటివ్ రావటంతో ఇంటికి పంపించేశారు.

అధికారుల అభినందనలు
ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో తనకు తెలియకుండానే కరోనా సోకినా భయపడకుండా వైద్యులకు .. ప్రభుత్వానికి సహకరించి బాలుడు కరోనాను జయించాడని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు.. ఇతర సిబ్బంది చప్పట్లతో అభినందిస్తూ ప్రత్యేక వాహనం ఎక్కించారు.. ఆరోగ్య శాఖ అధికారి సత్యనారాయణ, ఎస్పీ భక్తవత్సలం, కోవిడ్ నోడల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది బాలుడిని ఇంటి వద్దకు తీసుకెళ్ళి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇది చదవండి 'వైకాపా సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.