ETV Bharat / state

మబ్బు చాటు అందాలు...మనసును తాకే క్షణాలు..

author img

By

Published : Aug 18, 2019, 11:12 PM IST

పచ్చని కొబ్బరి చెట్లు.. గల గల పారే నది పాయలు.. సహజసిద్ధమైన అందాలు.. చెబుతుంటేనే చూడాలనిపిస్తోంది కదా! మరి చూస్తే! ఎంత ఆహ్లాదం.. ఆ ప్రకృతి అందాలు చూడాలంటే...తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు వెళ్లాల్సిందే.

కోనసీమలో ప్రకృతి అందాలు
కోనసీమలో ప్రకృతి అందాలు

కోనసీమలో కొబ్బరికాయలు మాత్రమే కాదండోయ్... అక్కడి చెట్టు, పుట్టా...వాగు వంకా...అన్ని మధురమే...మనసుని దోచుకునేవే... మరి ఆ అందాలన్నింటిని మబ్బులు దోచేస్తే... అదీ అందమే... నల్లటి మబ్బు పట్టిన వేళ..వీచే గాలి... ఊగే పైరు..పారే సెలయేరు...ఇంకేం కావాలి... పకృతిని ఆస్వాధించడానికి ... ఆనందించడానికి...మబ్బు చాటు అందాలు చూడతరమా! అన్నట్లు ఉంటాయి కదూ...మరెందుకండీ ఆలస్యం.. ఆ అందాలను మీరు వీక్షించండి.
ఇదీ చూడండి:వెలుగులు జిలుగులు...ప్రకృతి రంగులు..!

Intro:ap_knl_81_18_llc_works_av_AP10132
ఆంధ్ర కర్ణాటక ప్రజలకు జీవనాడి ఎల్ ఎల్ సి కర్ణాటకలోని హోస్పేట లో తుంగభద్ర నదిపై ప్రాజెక్టు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కర్నూలు జిల్లాకు సాగు, తాగు నీటిని అందించే దిగువ కాలువ కు మరమ్మతుల పేరిట ఏటా కోట్ల రూపాయలను బోర్డు విడుదల చేస్తుంది. అయితే నీళ్ళు వదిలే ముందు టెండర్లు పిలుస్తున్నడంతో గుత్తేదారులు కాలువకు నీళ్ళు వదిలే సమయాన్ని చూసుకొని పనులు ప్రారంభిస్తున్నారు. దీంతో గుత్తేదారులకు కాలువ పనులు జేబులు నింపుతున్నాయి.

Body:తుంగభద్ర బోర్డు నుంచి కర్నూలు జిల్లాకు సాగు,తాగు నీరు అందించే దిగువ కాలువ (ఎల్ ఎల్ సి) మరమ్మతుల పేరిట కాలువ గట్లు దెబ్బతిన్నాయని జంగిల్ క్లియరెన్స్ అంటూ ఏటా తుంగభద్ర బోర్డు కోట్ల రూపాయల కు టెండర్లు పిలుస్తుంది. టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా వాటిని దక్కించుకున్న గుత్తేదారులు పనులు ప్రారంభించక జులై చివరి వారంలో పనులు ప్రారంభించడంతో ఆగస్టు 15వ తేదీ నాటికి తుంగభద్ర బోర్డు కాలువలకు నీరు విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో గుత్తేదారులు తూతూ మంత్రంగా పనులు చేసి పనులు మమ అనిపించేస్తున్నారు. దీంతో అనుకున్న లక్ష్యం చేరడం లేదు.

Conclusion:ఫలితంగా జిల్లాకు రావాల్సిన వాట సక్రమంగా అందడం లేదు. ఇలాంటి పనులపై అధికారులు దృష్టి సారించి కాలువకు నీళ్లు నిలిపేసిన నాటినుంచే టెండర్లు పిలిచి పనులు చేపడితే అనుకున్న లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.