తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం రాజుపాలెం సమీపంలోని జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, టాటా మ్యాజిక్ వాహనం ఢీకొన్న ఘటనలో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారంతా పల్లెపాలెం మండలానికి చెందినవారు కాగా.. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని దరియాలతిప్ప గ్రామంలో గురువారం రాత్రి వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ఈ విషాదం జరిగింది.
పోలీసులు క్షతగాత్రులను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. టాటా మ్యాజిక్ వాహనం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి: DEAD: జొన్నాడ జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి