ఎంఈవో నిరంకుశ ధోరణితో ఉపాధ్యాయులను వేధిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు నిరసనకు దిగారు. ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వెళ్లి.. మళ్లీ పాఠశాలల్లో విధులకు హాజరవ్వాలని ఎంఈవో ఆదేశాలు జారీ చేశారన్నారు. మెడికల్ సెలవులు అవసరమైన వారికి ఇవ్వకుండా తనకు కావాల్సిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఆమెతో మాట్లాడేందుకు ఎంఈవో కార్యాలయం వద్దకు వెళ్లామనీ.. అయినా తమ ఆవేదన వినలేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి ఎంఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అక్కడకు చేరుకుని ఉపాధ్యాయులకు నచ్చచెప్పటంతో వారు నిరసన విరమించారు.
ఇవీ చదవండి.. వైకాపా దౌర్జన్యాలు చేసి గెలవాలని చూస్తోంది'