విద్యార్దులచే ఆవిరి పట్టిస్తున్న ఉపాధ్యాయుడు తూర్పు గోదావరి జిల్లా వై. రామవరం మండలం పనసలపాలెంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గాంధీ బాబు అనే ఉపాధ్యాయుడు కరోనాను నియంత్రించేందుకు.. విద్యార్థులకు ఆవిరి పట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఉపాధ్యాయుడు పొయ్యి ఏర్పాటు చేసి.. దానిపై కుక్కర్‌ను పెట్టి జండూ బాం, విక్స్ వంటి వాటిని నీళ్లలో మరగబెట్టి ఆ ఆవిరిని విద్యార్థులకు పడుతున్నారు. ముఖ్యంగా రొంప, దగ్గుతో పాటు ఊపిరి పీల్చడం కష్టంగా ఉన్న విద్యార్థులకు ఈ విధంగా ఆవిరి పట్టేలా చేసి ఉపశమనం కలిగిస్తున్నారు. దీంతో తోటి ఉపాధ్యాయులు అధికారులు గాంధీబాబును ప్రశంసిస్తున్నారు.
ఇవీ చూడండి...