ప్రజా సమస్యలపై చర్చించకుండా, విలువైన సమయాన్ని శాసనసభలో వైకాపా నాయకులు వృథా చేస్తున్నారని... తెదేపా సీనియర్, మాజీ ఎమ్మెల్యే నాయకులు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. జగ్గంపేటలో తన స్వగృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైందని దుయ్యబట్టారు. దేవాలయం లాంటి శాసనసభలో మంత్రులు సక్రమంగా వ్యవహరించడం లేదని నెహ్రూ తప్పుపట్టారు. సమస్యలపై మాట్లాడవలసిన బాధ్యత అధికార ప్రతిపక్షాలపై ఉందని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో ఈనాడు ఆటో షోకు భారీ స్పందన