వైద్య సిబ్బందికి మాస్కులు లేవని చెప్పినందుకు డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై... చొక్కావిప్పి, చేతులు వెనక్కి కట్టి కొట్టుకుంటూ పోలీసు స్టేషన్‌కు తరలించడం హేయమైన చర్యని... తూర్పుగోదావరి జిల్లా దళిత నాయకులు విమర్శించారు. విశాఖలో కెమికల్ గ్యాస్ లీకై మృతి చెందిన కుటుంబసభ్యులకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం... ప్రకాశం జిల్లా మాచవరం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన 11 మంది దళిత కూలీలకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే పరిహారం అందజేస్తామనడం... దళితులపై ప్రభుత్వానికి ఏపాటి ప్రేమ ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి వ్యవసాయ కార్యకలాపాలకు ఇబ్బంది కలగొద్దు'