రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగాలని..తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలపై పోలీసులు చేసిన లాఠీఛార్జీలకు వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు. ర్యాలీని ప్రత్తిపాడు పోలీసులు అడ్డుకోవడం వల్ల కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం పోలీసులతో పాలన కొనసాగిస్తుందని తెదేపా నేతలు విమర్శించారు. రాజధానిగా అమరావతి కొనసాగేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రాజా ప్రకటించారు.
ఇదీ చదవండి: