పెదనందిపాడులో బంద్.. నిర్మానుష్య వాతావరణం - పెదనందిపాడులో బంద్ వార్తలు
గుంటూరు జిల్లా పెదనందిపాడులో అమరావతి ఐకాస ఆధ్వర్యలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజలు ఐకాసకు సహకరించారు. దకాణదారులు మద్దతు తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఈ కారణంగా.. గ్రామంలో నిర్మానుష్య వాతావరణం ఏర్పాడింది.
Anchor : రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో తీసుకువచ్చిన బిల్లు పై ఐకాసా ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు జిల్లా పెదనందిపాడులో బంద్ సంపూర్ణగా జరిగింది. ఉదయాన్నే గ్రామంలో బంద్ కు ప్రజలు సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేయగా...దుకాణదారులు సంపూర్ణ మద్దతు పలికారు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వ , ప్రవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. దుకాణాలను మూసివేసి వేయడంతో గ్రామంలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. కాకుమానులో తెదేపా నాయకులు బంద్ నిర్వహించారు. పాఠశాలలు మూపించారు.