ETV Bharat / state

TDP fact finding comity on Mining: మైనింగ్​పై తెదేపా నిజనిర్ధారణ బృందం యాత్ర.. తీవ్ర ఉద్రిక్తత! - minings in visakha

తూర్పుగోదావరి - విశాఖ జిల్లాల సరిహద్దు మన్యం ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలపై తెలుగుదేశం నిజనిర్ధారణ బృందం చేపట్టిన యాత్ర.. తీవ్ర ఉద్రిక్తత, అరెస్టులకు దారితీసింది. రౌతులపూడి మండల అటవీ ప్రాంతంలో పర్యటించిన తెలుగుదేశం బృందం.. రిజర్వ్‌ ఫారెస్టులో రోడ్డు నిర్మాణం, మైనింగ్‌ ప్రాంతం నుంచి లేటరైట్‌ తరలింపు అంశాలను పరిశీలించింది. తవ్వకాలపై గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకుంది. ఆ తర్వాత వివరాలను మీడియాకు వివరించేందుకు సిద్ధమైన నేతలను అడ్డుకున్న పోలీసులు... అరెస్టు చేసి కోటనందూరు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

tdp leaders arrest
తెదేపా నేతల అరెస్ట్
author img

By

Published : Jul 10, 2021, 7:59 AM IST

మైనింగ్‌ తవ్వకాలపై మన్యంలో తెలుగుదేశం నేతల పర్యటన.. ఉద్రిక్తత

బాక్సైట్‌ దోచుకునేందుకు వైకాపా ప్రభుత్వం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తోందని తెలుగుదేశం ఆరోపించింది. విశాఖ మన్యం నాతవరం మండలం సిరిపురం పంచాయతీ పరిధిలో లేటరైట్‌ తవ్వకాలు, తరలింపును.. సీనియర్‌ నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబు నేతృత్వంలోని తెలుగుదేసం నిజనిర్ధారణ బృందం పరిశీలించింది. అన్నవరం నుంచి రౌతులపూడి మండలంలోని గిరిజన ప్రాంతం దబ్బాది వరకు పర్యటించి.. లేటరైట్‌ తవ్వకం, తరలింపునకు రిజర్వు ఫారెస్టులో వేసిన రోడ్డు గురించి గిరిజనులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

రౌతులపూడి మండలం జల్దాం నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు కొండలు, గుట్టలు తొలిచి రోడ్డు వేసిన వైనాన్ని గిరిపుత్రులు తెలియజేశారు. 40 ఏళ్లుగా కాలిబాటలా ఉన్న దారిని ఆఘమేఘాల మీద విస్తరించారని.. నిత్యం వందలాది లారీలు ఖనిజం తరలిస్తున్నాయని తెలిపారు. రహదారి నిర్మాణం కోసం పచ్చని చెట్లను నరకడంతో పాటు పొలాల్ని బలవంతంగా లాక్కున్నారని.. పరిహారం అడిగితే బెదిరిస్తున్నారని గిరిజనులు చెప్పినట్లు తెలుగుదేశం నేతలు వెల్లడించారు.

బలవంతంగా స్టేషన్​కు తరలింపు..

పరిశీలన అనంతరం తిరిగి రౌతులపూడి చేరుకున్న తెలుగుదేశం నేతలు మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవగా అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని నేతలు నిలదీశారు. నాయకులు మాట్లాడేందేకు ప్రయత్నించగా.. పోలీసులు ఏమాత్రం అంగీకరించలేదు.

ఈ క్రమంలో పరస్పర వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూడున్నర గంటలసేపు రౌతులపూడిలోనే వేచిఉన్న నాయకుల్ని.. పోలీసులు బలవంతంగా కోటనందూరు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై తెలుగుదేశం నేతలను పోలీసులు విడుదల చేశారు. లేటరైట్‌ ముసుగులో వైకాపా చేస్తున్న బాక్సైట్‌ దోపిడీని బహిర్గతం చేశామన్న సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు.. పోరాటాన్ని ఇంతటితో ఆపబోమన్నారు.

కేసుల్ని ఉపసంహరించుకోవాలి..

ధనదాహానికి అడ్డు అదుపూ లేదన్నట్లు పంచభూతాలనూ వైకాపా నేతలు దోచేస్తున్నారని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. లేటరైట్‌ తవ్వకాల ముసుగులో వేల కోట్ల విలువైన బాక్సైట్‌ను అక్రమంగా తవ్వేస్తున్నారని.. దీనిపై సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. అప్పటివరకూ తవ్వకాలు ఆపేయాలన్నారు. బాక్సైట్‌ తవ్వకాలపై నిజనిర్ధారణకు వెళ్లిన తెలుగుదేశం నేతలపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

కేంద్ర పరిధిలోకి వైద్య విద్య సీట్ల భర్తీ!

JAGAN PLAYED CRICKET: సీఎం జగన్​ బ్యాటింగ్​..ఎంపీ అవినాష్​ బౌలింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.