మాజీ ఎమ్మెల్యే, తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు 5వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో ఆ పార్టీ నేతలు నివాళి అర్పించారు. నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి వరుపుల రాజా.. చిట్టి బాబు చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా చిట్టిబాబు సేవలను ఆయన కొనియాడారు. ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. అతని కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోండి'