Kinjarapu Achchennaidu visited Durgamma in Indrakiladri: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వందేళ్లలో ఎన్నడూ లేని కరవు పరిస్థితులు తలెత్తాయన్నారు.
Former Minister Narayana Couple Special Pooja at Sri Mahalakshmi Devasthanam: నెల్లూరు నగరంలో గడపగడపకు వెళ్తున్న మాజీమంత్రి నారాయణకు ప్రజలు నీరాజనాలు పలికారు. శ్రీమహాలక్ష్మీ దేవస్థానంలో మాజీమంత్రి నారాయణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీమంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలు ఆదరణ మరువలేనిది అని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీ ఖాయం అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరారు. గతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకోవడం ఆనందంగా ఉంది.. అధికారంలోకి రాగానే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
Koona Ravikumar Reaction on Punganur Cycle Yatra Incident: రాష్ట్రంలో రెడ్డిల రాజ్యం ఏలుతుందని టీడీపీ నేత కూన రవికుమార్ (TDP leader Koona Ravikumar) మండిపడ్డారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో.. బూర్జ మండలం వైసీపీ మహిళా అధ్యక్షురాలు భర్త వైకుంఠంతో కలిసి మరికొందరు కూన రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పం వరకు టీడీపీ సానుభూతి పరులు సైకిల్ యాత్ర (Cycle trip by TDP sympathizers) చేస్తే.. పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడాన్ని కూన రవికుమార్ ఖండించారు. ఉత్తరాంధ్ర ప్రజలు చిత్తూరు జిల్లా రావాలంటే వీసా తీసుకోవాలా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
Former MLA Nallamilli Ramakrishna Reddy Comments on Election Campaign: విజయదశమి సందర్భంగా సోమవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Former MLA Nallamilli Ramakrishna Reddy) పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు 150 రోజులు సమయం ఉన్నందున ఇకపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu arrest) న్యాయపోరాటంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే భవిష్యత్తుకు గ్యారెంటీకి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుండి కుప్పంకు టీడీపీ కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్రపై వైసీపీ సైకోల ప్రవర్తన కలచివేసిందని మాజీ మంత్రి కళావెంకట్రావు మండిపడ్డారు. ఉత్తరాంధ్రను అవమానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పుంగనూరు ఏమైనా పాకిస్తాన్ లో ఉందా.? దేశ సరిహద్దుల్లో లేని ఆంక్షలు పుంగనూరులో ఎందుకని ప్రశ్నించారు. స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు రోజులైన సీఎం స్పందించకపోవడం సైకో మనస్థత్వానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు.