తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ... తెదేపా నేత వరుపుల రాజా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ప్రత్తిపాడు మండలం గోకవరం నుంచి ఉత్తరకంచి వరకు కొనసాగింది. భారీ సంఖ్యలో తెదేపా శ్రేణులు రాజా వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.
పాదయాత్రను అపాలంటూ ఉత్తరకంచిలో వరుపుల రాజాను ప్రత్తిపాడు పోలీసులు అడ్డుకున్నారు. రాజాను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ నాయకుడిని అరెస్ట్ చేయొద్దంటూ నినాదాలు చేస్తూ.. పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు.
కొంత సమయం తరువాత పోలీసులు వరుపుల రాజాను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. పోలీస్‌స్టేషన్ దగ్గరకు చేరుకున్న తెదేపా శ్రేణులు... రాజాను వెంటనే విడిచిపెట్టాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు