అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు నా ఇల్లు- నా సోంతం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో కాకినాడ తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు నవీన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని గత 18 నెలలుగా వాయిదాలు వేస్తూ వస్తున్నారని నవీన్ విమర్శించారు. ఇప్పటికైనా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి