వైకాపా ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. రాజమహేంద్రవరంలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలను అణగదొక్కడం, మట్టి, ఇసుక వంటి సహజ వనరులు కొల్లగొట్టడం మినహా అభివృద్ధి శూన్యమని ఆరోపించారు.
గతంలో పథకాలకు పేర్లు మార్చి నవరత్నాలుగా ప్రకటించారని బుచ్చయ్యచౌదరి ఆక్షేపించారు. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరక్కపోయినా.. అప్పులు మాత్రం పెంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి..