ETV Bharat / state

తెదేపాకు తోట త్రిమూర్తులు రాజీనామా - tdp ex mla thota trimurthulu resign to tdp

తెదేపాకు మరో నేత షాక్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తెదేపాకు తోట త్రిమూర్తులు రాజీనామా
author img

By

Published : Sep 13, 2019, 6:38 PM IST

తెదేపాకు తోట త్రిమూర్తులు రాజీనామా

రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెదేపాకు షాక్ ఇచ్చారు. వెంకటాయపాలెంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో... తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఏ నిర్ణయమైనా.. కార్యకర్తలతో చర్చించే తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

తెదేపాకు తోట త్రిమూర్తులు రాజీనామా

రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెదేపాకు షాక్ ఇచ్చారు. వెంకటాయపాలెంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో... తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఏ నిర్ణయమైనా.. కార్యకర్తలతో చర్చించే తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

Intro:వైరస్ వల్ల దిగుబడి లేని మిరప పంట ,నష్టాలనుఎదుర్కొంటున్న మిరప రైతులు


Body:తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం నియోజకవర్గాలయినా ప్రత్తిపాడు,జగ్గంపేట,పెద్దాపురం,పిటాపురం నియోజకవర్గాల్లో విస్తృతంగా మిరప పంట సాగు చేస్తున్నారు. 2000ఎకరాలకు పైగా మెట్ట ప్రాంతంలో మిరప సాగు చేస్తున్నారు. అరుగాలం శ్రమించిన రైతుకు మిరప కన్నీళ్ల మంటను మిగులుస్థూందీ. నారు నాటిన నుంచి కాపు దశ వరకు శ్రమించిన రైతు శ్రమను తెగుళ్ల రూపంలో వెంటాడుతున్నయి. పంట చేతికి వచ్చే సమయంలో తెగులు విజృంభించటంతో రైతులు ఏం చేయలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు . లక్షల పెట్టుబడి పెట్టి దిగుబడికి నోచుకోక నష్టాలపాలు అవుతున్నామని వాపోతున్నారు. ఎన్ని పురుగుల మందులు వాడిన తెగులుని ఆపడం తమ వల్ల కావట్లేదని చెబుతున్నారు. దాదాపు నాలుగైదు కోతలు రావలసిన పంట రెండు కోతలకు పరిమితమవుతుందని అంటున్నారు. పక్షం రోజులకు ఒకసారి కొట్టే పురుగుల మందు రెండు రోజులకి ఒకసారి కొట్టవలసి వస్తుందని తెలిపారు. పంటను కాపాడుకోవటానికి మార్కెట్లోకి వచ్చిన రకరకాల మందులు కొడుతున్నామని, అమ్మకం దారులు ఇదె అదనుగా ఎక్కువ రేట్లను వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు..ఇంత నష్టం జరుగుతున్న ఏ అధికారి తమ పొలాలవైపు చూడలేదని చెబుతున్నారు. ఇప్పటికయినా వారు రైతులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో మిరప పంట వల్ల లాభాలు అందుకున్నామని కాని ఇప్పుడు పరిస్తితులు భిన్నం గా మారాయని చెప్పారు. దీనివల్ల రైతులు వ్యవసాయం చేయటానికి ఆసక్తి కనబరచట్లెదని చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో మిరప సాగు ఎక్కువగ చేస్తారని కాని ఈ తెగులు వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. జెమినీ తెగులు,దోమ వల్ల పంట ఎక్కువగా నాశనం అవుతుందని అన్నారు. సుమారు 3 నుంచి 4 అడుగుల పెరగాల్సిన మొక్కను ఈ తెగుళ్లు ముందే చంపెస్తున్నాయని చెబుతున్నారు. పంటకు దోమ పట్టడం వల్ల కాయలు ముడత వస్తుందని ,వీటిని మార్కెట్లలో ఎవ్వరు కొనట్లెదనీ అంటున్నారు. విత్తనాలు,ఎరువులు,పురుగుల మందులకీ అయ్యే ఖర్చుని బంగారం తాకట్టు పెట్టి మరీ సాగు చేస్తే చివరకు రూపాయి లాభం లేకుండా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మిరప పంటకి తెగుళ్ళు రాకుండా మంచి విత్తనాలను ఇవ్వాలని అన్నారు .లేదంటే మిరప పంట పండించే రైతులు కనపడరని చెబుతున్నారు.
శ్రీనివాస్,ప్రత్తిపాడు,617,ap10022
ప్రవీణ్,ejs స్టూడెంట్


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.