ETV Bharat / state

cbn fire on govt : ప్రభుత్వం 72గంటల్లో ధాన్యం మొత్తం కొనాలి.. రైతులకు అండగా టీడీపీ : చంద్రబాబు - ఏపీ ముఖ్యవార్తలు

Chandrababu naidu pressmeet : రాష్ట్ర ప్రభుత్వం 72గంటల్లో పంట ఉత్పత్తులను పూర్తిగా కొనుగోలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. లేదంటే.. రైతులకు అండగా టీడీపీ ఆధ్వర్యాన ఈ నెల 9 నుంచి ఆందోళన తప్పదని హెచ్చరించారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కోనసీమలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 5, 2023, 10:05 PM IST

Chandrababu naidu pressmeet : అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందో స్పష్టం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 72 గంటల్లో దిగుబడులు పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరం కలిసి తిరుగుదాం అని నాయకులు, పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. అందులో భాగంగా ఈ నెల 9న తహశీల్దార్లకు వినతులు, 11న కలెక్టరేట్ల వద్ద వినతులు అందించాలని సూచిస్తూ.. 13న నిరసన దీక్షలకు పిలుపు నిచ్చారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటలు దెబ్బతింటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహించారు.

ధాన్యం ఎందుకు తీసుకోవడం లేదు.. సంక్షోభం వస్తే భరోసా కల్పించాల్సిన సీఎం, మంత్రులు, అధికారులు రైతుల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. విధ్వంస పాలనతో రైతుల్ని నట్టేట ముంచారు.. రైతులకు బీమా కట్టలేదు.. ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నూకల వంకతో ధరలో కోత పెట్టడం దారుణం అని పేర్కొన్న బాబు.. కొనుగోళ్లలో కోత పెట్టకుండా డబ్బులు చెల్లించాలని అన్నారు. గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం ఎందుకు సేకరించలేదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కోనసీమలో పర్యటన.. అంతకు ముందు అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. కోనసీమ జిల్లా వేగయమ్మపేటలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, వారితో మాట్లాడి కష్ట, నష్టాలు తెలుసుకున్నారు. అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామని చంద్రబాబు ముందు రైతులు గోడు వెల్లబోసుకున్నారు. వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం, దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇంకా 40 నుంచి 50 శాతం పంట కల్లాలు, చేలల్లోనే ఉందని, రైతులను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అని అన్నారు. ధాన్యం తడిసిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. కౌలు రైతుల పరిస్థితి ఏమిటి అని సీఎం జగన్​ను ప్రశ్నించారు. వాతావరణ హెచ్చరికలు ఉన్నా.. ఈ ప్రభుత్వానికి సకాలంలో గోనె సంచులు పంపించడం కూడా చేతగాదా?.. పంపించినవి వాటిల్లోనూ చిరిగినవి ఇస్తారా? అని మండిపడ్డారు. అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు.. ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వమిది అని విమర్శించిన చంద్రబాబు.. రైతులకు న్యాయం చేయలేకపోతే సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. సీఎంకు.. రైతుల వద్దకు వచ్చే తీరిక లేదా?.. రైతులు ఇబ్బందుల్లో ఉంటే మంత్రులెక్కడ?.. రైతుల జీవితాలతో ఆడుకుంటారా? అని నిలదీశారు. పొలాల్లోని పంటకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారో తక్షణమే సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని అన్నారు. కౌలు రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని, రైతు పండించిన ప్రతి గింజా కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఆదిరెడ్డి భవానికి పరామర్శ.. జగత్‌జనని చిట్‌ఫండ్‌ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైలులో రిమాండ్‌లో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, వాసును చంద్రబాబు.. ములాఖత్‌లో కలిశారు. ఆదిరెడ్డి భవానీ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఏ తప్పు చేయని పిల్లలను కూడా విచారిస్తున్నారని, ప్రభుత్వ ఉన్మాద చర్యలు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. ఏ తప్పు చేశారని ఆదిరెడ్డిని అరెస్టు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఆదిరెడ్డి కుటుంబాన్ని విశ్వసిస్తున్నారని, స్థానికులంతా అండగా ఉన్నారని తెలిపారు. ఆదిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో విశ్వసనీయతను చాటుకుందన్న చంద్రబాబు.. వారికి టీడీపీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్తుందని, వైఎస్సార్సీపీని దోషిగా నిలిపే బాధ్యత స్థానిక నేతలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ రోజురోజుకూ పతనావస్థకు వెళ్తోందన్న చంద్రబాబు.. పతనావస్థకు వెళ్తున్నందునే దుర్మార్గాలు చేస్తున్నారని అన్నారు. ఎవరినీ ఆర్థికంగా ఎదగనీయకుండా అణచివేస్తున్నారని, తప్పుడు పనులు చేసినవారికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని చెప్పారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.