తూర్పు గోదావరిలోని పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని తెదేపానేత అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీల నాయకులు తహసీల్దార్ కు వినతిపత్రం అందచేశారు. పెదపూడి మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలిపితే పలు గ్రామాల ప్రజలు ... అక్కడి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే సుమారు 50 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుందని అన్నారు. కాకినాడ, పెదపూడికి చేరువగా ఉన్నందున అందులో కలపాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ భాజపా కన్వీనర్ మేడపాటి హరినారాయణరెడ్డి , జనసేన అనపర్తి నియోజకవర్గ ఇంచార్జి మార్రెడ్డి శ్రీనివాసరావు, సీపీఐ నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఆంధ్రా తెలుగు జనతా పార్టీ నాయకులు పెతింశెట్టి వెంకటేశ్వర్లు, తెదేపా, భాజపా, జనసేన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్‌ఈసీ