తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సమీపంలోని గోదావరి ఇసుక తిన్నెలపై ఆర్.కె సంస్థ 33 / 11 కేవీ విద్యుత్తు వైర్లు వెళ్లే టవర్ నిర్మిస్తోంది. పనులు జరుగుతుండగా గోదావరిలో భారీగా వరద నీరు చుట్టుముట్టింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వరదనీరు చేరుతున్న క్రమంలో.. ఆత్రేయపురం గోదావరి పాయకు నీరు వెంటనే చేరింది. పనుల్లో ఉన్న పొక్లెయిన్ డ్రైవర్, మరో ముగ్గురు వ్యక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు. వారిలో ముగ్గురు వెంటనే అప్రమత్తమై ఒడ్డుకు చేరగా.. మరొకరు పొక్లెయిన్ లోనే ఉండిపోయారు. పోలీసులు, స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకుని.. తాడు సాయంతో మిగిలిన వ్యక్తిని రక్షించారు. అదే సమయంలో వరదనీరు పెరిగి పరిసర ప్రాంతాల్లోకి చేరింది. వరద బాధితులను పవడల సహాయంతో ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చూడండి 11న మొదలయ్యే సభ ముందుకు.. 11 సవరణ బిల్లులు