ఏం జరిగింది...?
2019-20లో బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థుల ఆర్‌టీఎఫ్ వివరాల నమోదు వేళ సిబ్బంది బీఎస్సీ (ఎంసీసీఎస్) రెగ్యులర్‌గా పేర్కొనడంతో తొలి ఏడాది రూ.1,673 మాత్రమే జమైంది. తర్వాత తప్పిదాన్ని గమనించిన ప్రిన్సిపల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రెగ్యులర్‌కు బదులు సెల్ఫ్ ఫైనాన్స్‌డ్‌గా మార్చడంతో తర్వాత రెండేళ్లు రూ.9,480 చొప్పున జమైంది. మొదటి ఏడాది వ్యత్యాసం రూ.7,807 చెల్లించాలని కళాశాల సిబ్బంది చెప్పడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ‘ఈనాడు- ఈటీవీ’ ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ రవిచంద్ర విద్యార్థులతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సొమ్ము చెల్లించలేమని, ఉన్నత చదువుల కోసం వెంటనే టీసీ, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని విన్నవించారు. ప్రిన్సిపల్ ఈ విషయమై ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడారు. అప్పట్లో జరిగిన తప్పిదాన్ని, తర్వాత పరిణామాలను వారికి వివరించారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు రెగ్యులర్ కోర్సులకు అనుగుణంగా ఫీజులు సర్దుబాటు చేసి వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించడంతో సమస్య పరిష్కారమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు ‘ఈనాడు - ఈటీవీ’కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు