ETV Bharat / state

ఆ విద్యార్థినుల చేతులు... అద్భుతాలు చేస్తున్నాయి

సాధారణంగా పాత వస్తువులను మనం పారేస్తాం. కానీ అవే వస్తువులు వారికిస్తే వాటితో ఆకర్షణీయ వస్తువులు తయారు చేసి ఔరా అనిపిస్తారు. కాదేదీ కళకు అనర్హం అని నిరూపిస్తూ అద్భుతాలు సృష్టిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా తుని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు. వ్యర్థ పదార్ధాలు, వాడి పారేసిన పరికరాలు, పనికిరాని వస్తువులను అందంగా మలుస్తున్నారు.

Students of the Tuni Government Girls' School making beautiful  things with waste material
అబ్బుర పరుస్తున్న తుని ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు
author img

By

Published : Mar 7, 2020, 8:56 PM IST

తమ సృజనాత్మకతతో అందరినీ అబ్బురపరుస్తోన్న విద్యార్థినులు

చిట్టి చేతులతో పాత వస్తువులకు కొత్త రూపాన్ని ఇస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా తుని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు. తమ సృజనాత్మకతతో కాగితాలు, అట్టలు, దుస్తులు, పెన్నులు తదితరాలతో ఆకర్షణీయ వస్తువులు తయారు చేస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు. చదువుతో పాటు కొంత సమయం క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్​లకు కేటాయించి వీటి తయారీలో మెళకువలు నేర్చుకుంటున్నారు. పాఠశాలకు వచ్చే అతిథులు, ఉపాధ్యాయులు, స్నేహితుల పుట్టినరోజును వీటిని బహుమతులుగా అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.