తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో దుకాణాలను ఒంటిగంట వరకు తెరుచుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. బండారులంక, కొత్తపేట ప్రాంతాల్లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సందర్భంలో విధించిన లాక్ డౌన్ కు.. ప్రస్తుతం సడలింపులు ఇచ్చారు.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు గతంలో అనుమతించారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ ఒంటి గంట వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. అందరూ.. భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: