తూర్పు గోదావరి జిల్లా ఇంద్రపాలెంలో రజకుల వినియోగంలో వందేళ్లుగా ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలని ఆ సంఘ ప్రతినిధులు ధర్నా చేశారు. కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రజక వృత్తిదారులు బట్టలు ఉతుకుతూ.. ఇస్త్రీ చేస్తూ నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెంలో రజక స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా బావులు మూసివేసి, బల్లలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
1968లో కాకినాడ మున్సిపాలిటీ అనుమతులు పొందామని చెప్పారు. సచివాలయం నిర్మాణం పేరుతో 100 కుటుంబాల ఉపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. మున్సిపాలిటీ తీర్మానం చేసి ఇచ్చిన స్థలం ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం రజకులకు మేలు చేయకపోగా... ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: