ETV Bharat / state

గాల్లో దీపాల్లా ప్రాణాలు.. కాగితాలకే పరిమితమైన నిబంధనలు - BOATACCIDENT

అధికారుల నిర్లక్ష్యంతో నదీతీరాల ప్రమాద నిలయాలుగా మారుతున్నాయి. కృష్ణా నదిలో ఫెర్రీ ప్రమాదంతో అప్పమత్తమైన ప్రభుత్వం జలరవాణాపై కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. అందులోకి ఏ చర్యా సరిగ్గా అమలు చేయకపోవటం వల్లే మరోసారి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఉత్తర్వులు
author img

By

Published : Sep 16, 2019, 5:46 AM IST

కృష్ణా నదిలో 2017 నవంబరులో విహారానికి వెళ్లి 22 మంది మృత్యువాత పడిన ఫెర్రీ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలతో జీవో నెంబర్ 667 జారీ చేసింది. కానీ ఆ నియమాలు, నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయనడానికి 2018 మేలో జరిగిన గోదావరి పడవ ప్రమాదం, ఇప్పుడు మరోసారి గోదావరిలో జరిగిన ఘోర విషాదమే సాక్ష్యాలు.

నిబంధనలు ఇవి

నదిలో ప్రయాణించే బోట్లు, లాంచీలు రవాణాకు అనుకూలంగా ఉన్నాయని జలవనరుల శాఖకు సంబంధించిన కార్యనిర్వహక ఇంజినీరు నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ధ్రువీకరణ పత్రం కాలపరిమితి కేవలం ఏడాదికి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఆ బోటు నదిపైకి వెళ్లాంటే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధృవీకరించాల్సిందే. కృష్ణా, గోదావరి నదిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పర్యాటక శాఖ బోట్లు మాత్రమే ఈ నిబంధనలు పాటిస్తున్నాయి. ప్రైవేటు బోటుల నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అని పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జలరవాణాకు ఆస్కారం ఉన్న ప్రతి జిల్లాలో రెవెన్యూ, పోలీస్, జలవనరుల, అగ్నిమాపక, పర్యాటక, మత్స్యశాఖలకు సంబంధించిన అధికారులతో జిల్లా స్థాయి కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేయాలి. జిల్లాలో జలరవాణాకు సంబంధించి మొత్తం పర్యవేక్షణ కమిటీ చేపట్టాలి. నదీ ప్రయాణానికి సంబంధించి ఎవరెవరికి లైసెన్సులు ఇచ్చారో పూర్తి జాబితాను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కలెక్టర్‌కు సమర్పించాలి. లైసెన్సులు కలిగిన ప్రతి బోటును కమిటీలో ఉన్న అధికారులు తనిఖీ చేయాలి. బోటులో ఎంత మంది ప్రయాణించాలి, లైఫ్ జాకెట్ సౌకర్యం ఉందా లేదా, ప్రతి ఐదుగురు ప్రయాణికులకు ఒక బోయాకట్టె ఉందా లేదా అని క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే బోటుకు అనుమతి ఇవ్వాలి. జిల్లా స్థాయి కమిటీ ఇచ్చిన సేఫ్ బోటు ధృవపత్రాన్ని బోటులో ప్రయాణికులు ఎక్కే ద్వారం వద్ద ప్రదర్శించాలి. అలా ఉన్న బోటు మాత్రమే నదిలో ప్రయాణించాలి. అనుమతులు లేని బోటు నదిలో ప్రవేశించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు. ఇదంతా జరిగితే పడవ ప్రమాదాలు పునరావృతమయ్యేవి కావు.

నదిలో పెద్ద రాళ్లు ఉన్నచోట, ఇసుక మేటలు వేసిన చోట, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బోయకట్టెలను ఏర్పాటు చేయాలి. దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నీటిలో పడినవారు బోయకటెట్ల ఆధారంగా ప్రాణాలు కాపాడుకోవచ్చు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రయాణికులను, పర్యాటకులను బోటులో ఎక్కించుకునేందుకు వీలుగా ఉన్న బల్లకట్టు ఎక్కడ ఉందో గుర్తించి సమీపంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి. కంట్రోల్ రూమ్లో పోలీసు, జలవనరుల, పర్యాటక శాఖ అధికారులు ఉండాలి. నదిలో తిరిగే ప్రతి బోటుతో ఈ కంట్రోల్ రూముకు వైర్‌లైస్ సంబంధాలు కొనసాగాలి.

చర్యలు ఏవి?

నదిలో పర్యాటకుల బోట్లతో పాటు పరిసర గ్రామాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల బోట్లు కూడా నడుస్తుంటాయి. ఏయే ప్రాంతాల్లో అయితే రవాణా ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు గోదావరిలో జరిగిన ప్రమాదంలో సమీప గ్రామస్థులు చొరవ చూపి కొంత మందిని కాపాడారే తప్ప ప్రమాద సమయంలో సమీపంలో ఎలాంటి రక్షణ దళాల జాడ లేదు.

Intro:AP_ONG_21_15_YUVA PAARISRAMIKUDU_ VIS _AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

యాంకర్ పార్ట్:_
అందర్లాగే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ప్రముఖ కియా మోటార్స్ కంపెనీ లో ఉద్యోగం కొత్త కొత్తగా ఉంది అయినా అతని మనసులో మాత్రం మరో ఆలోచన సొంత గ్రామంలో ఏదైనా ఉపాధి కల్పించాలని ,ఒక పరిశ్రమ నెలకొల్పాలని మనసులో తడుతూనే ఉంది మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పటికీ ఉద్యోగాన్ని వదులుకొని సొంతంగా తన గ్రామంలో పరిశ్రమ నెలకొల్పి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు తుమ్మలపెంట రామ్ నారాయణ్

రామ్ నారాయణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ఎంపికల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కియా కంపెనీ లో ఉద్యోగం వచ్చినప్పటికీ సొంత పరిశ్రమ నెలకొల్పడం వైపే దృష్టిసారించాడు. తను పుట్టి పెరిగిన గ్రామానికి పెద్దగా ప్రాచుర్యం లేకపోయినప్పటికీ, ఆ గ్రామం కు జిల్లా వ్యాప్తంగా మంచి పేరు తీసుకురావాలని ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించి వస్తువుల తయారీ కంపెనీ నెలకొల్పాడు.

రామ్ నారాయణ్ చెన్నై హిందుస్థాన్ యూనివర్సిటీ లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి , చదువుతూ ఉండగానే ఉద్యోగం సంపాదించాడు. తాత ,తండ్రి ఇనుము సిమెంట్ వ్యాపార రంగంలో 40 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ వారి వ్యాపారంలో తను చేరకుండా వినూత్నంగా ప్రయత్నించి ఇనుప వస్తువులు తయారీ కంపెనీ ప్రారంభించాడు .బ్యాంకు రుణాలు పొంది కొంత సొంత నిధులతో కర్మాగారాన్ని ఏర్పాటు చేసి స్థానికంగా ప్రస్తుతానికి 32 మందికి ఉపాధి కల్పిస్తున్నారు .
ఈ పరిశ్రమలో పరిశ్రమలు మేకులు ,బైండింగ్ వైర్, ఇనుప కంచె, ఇనుప రాడ్లు , మెస్ వివిధ రకాలైన వస్తువులు తయారు చేస్తూ ఇక్కడ తయారు చేసిన వస్తువులను విజయవాడ, నెల్లూరు ,ఒంగోలు ,గుంటూరు, నంద్యాల కర్నూల్ ,అనంతపురం వంటి నగరాలకు సరఫరా చేస్తున్నాడు.
రామ్ నారాయణ్ పరిశ్రమ నెలకొల్పే సమయానికి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆ పరిశ్రమలో అనుభవం లేదు తానే స్వయంగా అన్ని యంత్రాల సంబంధించినటువంటి పనితనాన్ని ఆరు నెలల సమయంలో స్వంతంగా నేర్చుకుని అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వారికి పనిలో మెళకువలు నేర్పిస్తూ తానే స్వయంగా యంత్రాలను ఆపరేట్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు .ఒకవైపు వ్యాపారం చూసుకుంటూనే మరొకవైపు పరిశ్రమలో పని చేస్తూ వారిలో స్పూర్తిని నింపుతూ, దినదినం పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాడు . రాబోయే రోజుల్లో పరిశ్రమలో వచ్చేటువంటి ఆదాయం పరిశ్రమకు ఉపయోగించి దానిని విస్తరించి 150 మందికి పైగా కూలీలకు పని కల్పించే విధంగా తయారు చేస్తాను అప్పుడే తను అనుకున్న ఆశయం నెరవేరుతుందని తెలియజేశాడు. పరిశ్రమ నెలకొల్పడంలో ప్రభుత్వ సహాయం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో లభిస్తుందని హరి ప్రోద్బలంతోనే ఈరోజు 22 సంవత్సరాలు వయసులోనే ఒక పారిశ్రామిక మెత్తగా ఎదగడానికి నాకు చక్కని అవకాశం లభించిందని తెలియజేశాడు.

బైట్స్ :- రామ్ నారాయణ తండ్రి
రామ్ నారాయణ్
తాత
కార్మికులు

Body:AP_ONG_21_15_YUVA PAARISRAMIKUDU_ VIS _AP10135

Conclusion:AP_ONG_21_15_YUVA PAARISRAMIKUDU_ VIS _AP10135

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.