ETV Bharat / state

లాక్​డౌన్ : సరిహద్దులు పూర్తి నిర్బంధం.. - ఏపీలో పూర్తి లాక్​డౌన్ వార్తలు

సరిహద్దుల మూసివేత, లాక్‌డౌన్‌ అమలును పోలీసులు మరింత కఠినతరం చేశారు. కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు భాగంగా... రోడ్లపై అనవసరంగా తిరిగేవారిపై లాఠీ ఝుళిపిస్తూనే... క్వారంటైన్‌ నుంచి తప్పించుకుంటున్న వారిని తిరిగి రప్పిస్తున్నారు. అనుమానిత లక్షణాలున్న కొత్తవారిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా నిర్బంధించారు.

state-borders-complete-closed-due-to-lock-down
లాక్​డౌన్ : సరిహద్దులు పూర్తి నిర్బంధం..
author img

By

Published : Mar 31, 2020, 6:12 AM IST

లాక్​డౌన్ : సరిహద్దులు పూర్తి నిర్బంధం..

రాష్ట్రంలో నిర్థరించిన 23 కరోనా కేసుల్లో 6 కేసులు విశాఖలోనే నమోదయ్యాయి. అందువల్ల లాక్‌డౌన్‌ అమలుపై అధికారులు క్వారంటైన్‌లో ఉన్నవారిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. స్వీయనిర్బంధం నుంచి ఎవరైనా తప్పించుకుంటే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. అనుమానితుల నమూనాలు సేకరించి నిర్థరణ పరీక్షలు చేయిస్తున్నారు. జిల్లాలో తాజా వైద్య పరీక్షల్లో 9 మందికి నెగటివ్‌గా తేలినట్లు కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. ఇప్పటివరకూ 160 నమూనాలు పంపగా 125 మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. 29 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందన్నారు.

విశాఖలో

సోమవారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 71 మందిపై కేసులు నమోదు చేసినట్లు విశాఖ జిల్లా ఎస్పీ వెల్లడించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మరో 206 కేసులు నమోదు చేశామన్నారు. పారిశుద్ధ్య పనులను జీవీఎంసీ కమిషనర్ సృజన ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కరోనా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించడం, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల సేకరణపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు.

తూర్పు గోదావరి జిల్లాలో

తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం రెండు కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల నిర్థరణతో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికోసం జల్లెడ పడుతున్నారు. పాజిటివ్ బాధితులు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రత్తిపాడు మండలంలో 40 మంది పిఠాపురంలో 17మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆలమూరు మండలంలో నలుగురిని బొమ్మూరు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

గత వారం హైదరాబాద్ నుంచి యానాం వచ్చిన ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజులు అతిథిగృహంలో ఉండేలా ఏర్పాటు చేశారు. క్వారంటైన్​ నుంచి వారు స్వగ్రామానికి పారిపోయారు. పారిపోయిన వీరిని తిరిగి రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం అందించకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గుంటూరులో

గుంటూరులో లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై జరిమానాలు, కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకూ గుంటూరులో 292 కేసులు నమోదు కాగా వేయికి పైగా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలోని ఉంటున్న వారి కదలికలపై యాప్ ద్వారా నిఘా పెట్టినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.

అనంతపురం జిల్లాలో

అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో పోలీసుల కళ్లుగప్పి బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న 2 వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన 122 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. గుత్తి గేట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నట్లు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో

చెన్నై నుంచి రాజస్థాన్‌కు వెళ్తున్న 54 మందిని చిత్తూరు జిల్లా కలికిరి పోలీసులు అడ్డుకున్నారు. చెన్నైలో ఓ కొరియర్ సంస్థలో పని చేస్తున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌కు వెళ్లిపోవాలని చెన్నై పోలీసులు సూచించినట్లు వీరు చెబుతున్నారు. పోలీసులు ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక బస ఏర్పాటు చేసి... భోజన సౌకర్యం కల్పించారు. చంటిబిడ్డలతో ఉన్న తమను రాజస్థాన్‌కు పంపాలని మహిళలు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి : గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. కరోనా నిరోధక చర్యలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.