తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంతో పాటు జిల్లా సమీపంలో ఉన్న యానాంలోనూ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ముమ్మడివరం, యానాం సీఐలు తెలిపారు. ఫలితంగా పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని... బయటకు వచ్చేటప్పడు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలు పాటించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యానాంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు
తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం, యానాంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాత్రి పూట పట్టణంలో కర్ఫ్యూ విధించి, ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంతో పాటు జిల్లా సమీపంలో ఉన్న యానాంలోనూ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ముమ్మడివరం, యానాం సీఐలు తెలిపారు. ఫలితంగా పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని... బయటకు వచ్చేటప్పడు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలు పాటించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచదవండి.
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి