కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని ఎస్పీ, డీఎస్పీ, సీఐ కార్యాలయాల్లో ప్రతీ చోట ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరిస్తామన్నారు. అవసరమైతే వారంలో రెండురోజుల పాటు ఫిర్యాదులు స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఏజన్సీ ప్రాంతంలో ప్రజలకు ఆ ప్రాంతంలోనే 15 రోజులకు ఒకసారి అందుబాటులో ఉంటామని చెప్పారు. జిల్లాలో స్నేహపూర్వక పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.
ఇదీచదవండి