ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తమ్మారావు అనే వ్యక్తిని హత్య చేసింది ఆయన పెద్ద కుమారుడు ఆదినారాయణే అని కాకినాడ ఇంఛార్జి డీఎస్పీ భీమారావు తెలిపారు. కోడలిని తమ్మారావు లైంగికంగా వేధించడం కారణంగానే అతని కుమారుడు ఆదినారాయణ హత్య చేసినట్లు నిర్ధారణలో చేర్చారు. ఈ సందర్భంగా ముద్దాయి నేరం ఒప్పుకుని లొంగిపోగా.. పిఠాపురం కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: