తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనకు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి మోకా శ్రీ విష్ణు ప్రసాద్ రావు మరణం.. పూడ్చలేని లోటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి విశ్వరూప్ కాట్రేనికోనలో దివంగత మోకా శ్రీ విష్ణు ప్రసాద్ రావు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దళిత వర్గాలకు, ఇతరులకు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు.
ఇదీ చదవండి: 'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్‌కు చెప్పండి'