తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని జీ పెదపూడి పాఠశాలలో 49 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులలో ఒకరిని బూరుగులంకలోని పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపించారు. దీనితో 49 మంది విద్యార్థులకు ఒక్క టీచరే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. బూరుగులంక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని సెలవులో ఉండడంతో జీ పెదపూడి నుంచి అక్కడకు డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయుని పంపించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చూడండి