తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద గోదావరి సాగర సంగమం చేస్తుంది. అంతర్వేదికి అనుసంధానంగా సాగర సంగమానికి అతి దగ్గరలో ఉన్న గ్రామం పల్లిపాలెం. ఇక్కడ ఉండేది అంతా మత్స్యకారులే. సముద్రతీరంలో ఉండటంతో గ్రామానికి అలల పోటు తప్పడం లేదు. ఇటీవల వచ్చిన పెను తుఫాను ప్రభావంతో సముద్రం పోటెత్తితే కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుందని జాలర్లు అంటున్నారు. ఈ ప్రాంతంలో సముద్రం సుమారు 200 మీటర్లు ముందుకు వచ్చింది.
గ్రామంలో రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో దుర్గంధం వస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సముద్రపు అలలు తమ గ్రామంలో ప్రవేశించకుండా రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: భయాందోళనలో ఓడలరేవు వాసులు