తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. శంఖవరం మండలం వజ్రకూటంలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమ వద్ద బోరు తవ్వుతుండగా.. విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని ఎస్సీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలోనే మృతదేహాలను ఖననం చేస్తామని హెచ్చరించారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఇదీ చూడండి..
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారు: తెదేపా