శాంతియుత జీవనం ద్వారా ప్రపంచ శాంతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆశ్రమమే శాంతి ఆశ్రమం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం తోటపల్లి గ్రామంలో కొండల నడుమ ఈ ఆశ్రమం ఉంది. ప్రకృతి ఒడిలో వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆశ్రమాన్ని 1917లో స్థాపించారు. అల్లూరి సీతారామరాజు, మాజీ రాష్ట్రపతి వి.వి. గిరిల బాల్య మిత్రుడైన మలిశెట్టి వెంకటేశ్వరరావు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఆయన ఓంకార స్వామీజీగా ప్రఖ్యాతి పొందారు.
ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండేలా
ఆధునిక సమాజంలో మనిషి ప్రశాంతతకు దూరము అవుతున్నాడు. ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఒత్తిడిని జయించి ప్రశాంతంగా జీవించేలా శాంతిని ప్రబోధిస్తుంది శాంతి ఆశ్రమం. మాతా జ్ఞానేశ్వరి ఆశ్రమ నిర్వహకురాలిగా కొనసాగుతున్నారు. ఏటా జనవరి 21న ఓంకార స్వామి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు. కాకినాడ, విశాఖ, పిఠాపురం, నీలగిరి ప్రాంతాల్లో ఆశ్రమానికి సంబంధించిన శాఖలున్నాయి. 120 కుటీరాలు కలిగిన ఈ ఆశ్రమంలో... వంద మంది వృద్ధులు ఇక్కడే వారి వన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వైద్యం, విద్య, అన్నదానం లాంటి అనేక సేవా కార్యక్రమాలను శాంతి ఆశ్రమం నిర్వహిస్తోంది.
ఇదీ చూడండి: