తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు అలుపెరగకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి సేవలను కొనియాడుతూ.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైకాపా నగర సమన్వయకర్త శివరామసుబ్రహ్మణ్యం తదితరులు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు, చేతులు కడిగారు. వారికి పాదాభివందనం చేశారు. ఎమ్మెల్యే సోదరుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో.. పళ్లు, సబ్బులు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారు చేస్తున్న సేవలను అభినందించారు.
ఇదీ చదవండి: