గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలకు హాజరైన తల్లులు... తమతో పిల్లలను తీసుకొచ్చారు. పరీక్షా కేంద్రాల్లో తల్లులను వదిలి వెళ్లమని మారాం చేయటం కనిపించింది. పలు చోట్ల అభ్యర్థులు సెల్ ఫోన్ వెంట తేగా.. వాటిని కళాశాల యాజమాన్యం సిబ్బంది సేకరించి భద్రపరచారు.
వసతులు లేక దివ్యాంగుల అవస్థలు
సచివాలయ పరీక్షలు రాసేందుకు వచ్చిన పలువురు దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం పరీక్షా కేంద్రం వద్ద దివ్యాంగులకు సరైన వసతులు అవస్థలు ఎదుర్కొన్నారు.
తికమక..మకతిక..
విజయవాడలో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. పటమట బాలుర ఉన్నత పాఠశాల, పటమటలంక బాలికల పాఠశాల విషయంలో అభ్యర్థులు తమ హాల్ టికెట్లు సరిగా... పరీశిలించుకోక అయోమయానికి లోనయ్యారు. చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేని పరిస్థితి నెలకొంది. 10 గంటలైనా పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు. హాల్ టికెట్లలో పటమట బాలుర పాఠశాలకు-బి, బాలికల పాఠశాలకు-జీ అని టికెట్లలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ విషయాన్ని గుర్తించలేక తికమక పడ్డారు.