కొవిడ్ కారణంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వాహకులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరసన చేపట్టారు. జిల్లాలో 200 అద్దె బస్సులు ఆర్టీసీ వినియోగించుకుంటోందని.. కొవిడ్ రెండో దశ విజృంభణతో.. తమకు నగదు చెల్లించలేదని నిర్వాహకులు తెలిపారు. మొదటి దశలోనూ.. 9నెలలు బస్సులు తిరగకపోవడంతో తాము నష్టపోయామని వాపోయారు. రెండో దశలోనూ తమ బస్సులు నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల తిరిగిన బస్సులకు కూడా.. నగదు చెల్లించలేదన్నారు. తమ బకాయిలు చెల్లించి.. అద్దె బస్సులు రోడ్డెక్కేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Curfew: రాష్ట్రంలో ఈ నెల 30 వరకు కర్ఫ్యూ పొడిగింపు