తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని చట్టీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. కుంట నుంచి హైదరాబాద్‌కు 460 కేజీల గంజాయిని 18 ప్లాస్టిక్ సంచుల్లో నింపుకుని తరలిస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్న రూ.13 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. సికింద్రాబాదులోని చిలకలగూడకు చెందిన జగ్గారెడ్డి ఒక్కడే గంజాయి లోడుతో బయలుదేరాడు. పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో చింతూరు సీఐ యువ కుమార్, ఆర్ఎస్ఐ సురేష్‌బాబుతో పాటు పోలీసులు పాల్గొన్నారు.
మన్యంలో రూ.13 లక్షల విలువైన గంజాయి పట్టివేత - మన్యంలో రూ.13 లక్షల విలువైన గంజాయి పట్టివేత
మన్యంలో 13 లక్షల విలువైన గంజాయిని చింతూరు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట నుంచి హైదరాబాద్‌కు వ్యాన్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.