ETV Bharat / state

ఈ దారి...గతుకుల రహదారి - తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో రహదారులు గతుకులమయంగా మారాయి. గ్రామీణ ప్రాంత రహదారులు రాళ్లు తేలి, చోదకుల నడ్డివిరుస్తున్నాయి. మెట్ట ప్రాంతంలో ప్రయాణం మరింత ఇబ్బంది కరంగా మారింది. అధ్వానంగా తయారైన దారుల్లో రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నామని వాహన చోదకులు అంటున్నారు.

ఈ దారి...గతుకుల రహదారి
ఈ దారి...గతుకుల రహదారి
author img

By

Published : Jun 23, 2020, 7:11 PM IST

తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం గతుకుల మయంగా మారింది. మెట్ట ప్రాంత నియోజకవర్గాలైన ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఏలేశ్వరం నుంచి జె.అన్నవరం వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. పెద్దపెద్ద గోతులతో రహదారి అధ్వాన్నంగా తయారైంది. యర్రవరం నుంచి ఏలేశ్వరం రహదారి కూడా గతుకులమయంగా తయారైంది.

ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి నుంచి శంఖవరం వెళ్లే రహదారి ఏళ్ల తరబడి నిర్వహణ చేపట్టక పోవడంతో మట్టిరోడ్డుగా మారిపోయింది. శంఖవరం మండలం కత్తిపూడి నుంచి రౌతులపూడి వెళ్లే రహదారి గోతులతో రాళ్లు తేలి ఉన్నాయి. ఉత్తరకంచి నుంచి పెద్దిపాలెం వెళ్లే రహదారిదీ అదే దుస్థితి. తాజాగా కురిసిన వర్షాలకు రోడ్లు బురదమయంగా మారాయి. ద్విచక్రవాహనాలతోపాటు ఆటోల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు అంటున్నారు. గర్భిణులు, అనారోగ్యంతో ఆసుపత్రులకు ప్రయాణించే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులు ఇంతలా దెబ్బతినడానికి ప్రధాన కారణం క్వారీలని స్థానికులు అంటున్నారు. క్వారీల నుంచి లారీల్లో టన్నుల కొద్దీ గ్రావెల్‌ రవాణా చేస్తుంటారు. అలాగే వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు కూడా ఇనుప చక్రాలతో రోడ్లపై నడపడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. కొత్తగా రోడ్డు వేసినా నాణ్యత కొరవడటం, నాసిరకం పనులు చేయడంతో వెంటనే దెబ్బతింటున్నాయని స్థానికులు చెప్పారు.

అధ్వాన్నంగా మారిన రహదారుల్ని తక్షణం బాగుచేసి....రవాణా సాఫీగా సాగేలే చర్యలు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : జులై 8న ఉచిత ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.