తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి జొన్నాడ సెంటర్ నుంచి తాళ్ళరేవు మండలం అరటికాయ లంక కేంద్రపాలిత యానం వరకు ఉన్న గౌతమి గోదావరి నది తీరం వెంబడి ఉన్న రహదారిని 4 వరుసల రహదారిగా విస్తరించేందుకు ఐదేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు విస్తరణకు 190 కోట్లు కేటాయించి సర్వే పనులు పూర్తి చేయించారు. ప్రారంభించేందుకు దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించినట్లు గాని ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. తీరం వెంబడి ఉన్న సుమారు 18 లంక గ్రామాల ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఈ రహదారి విస్తరణ వల్ల లంక గ్రామాల్లో పండే అరటి, కొబ్బరి... ఇతర వాణిజ్యపరమైన ఉత్పత్తులు తొందరగా మార్కెట్ చేరేందుకు అవకాశం ఉంది. కాకినాడ- అమలాపురం జాతీయ రహదారి 216 అనుసంధానంగా ఉండటం... యానం నుంచి రాజమహేంద్రవరం ప్రయాణించేవారికి 20 కిలోమీటర్లు దూరం తగ్గనుంది. సమయం ఆదా అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రహదారి విస్తరణ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి.