తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అనపర్తి గ్రామానికి చెందిన పిల్లి వీరబాబు, సత్తి సూర్య భాస్కర్ రెడ్డిలు బైక్పై వెళ్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఘటనలో వీరబాబు మృతి చెందగా... భాస్కర్ రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి