తూర్పుగోదావరి జిల్లాకి చెందిన గాది సత్తిబాబు(39), పి.శ్రీనులు మోటార్ సైకిల్పై కొత్తపేట నుంచి రావులపాలెం వస్తున్నారు. అదే సమయంలో కొత్తపేటకి చెందిన చోడపనీడి రాంబాబు, అనూషలు రావులపాలెం నుంచి కొత్తపేట వెళ్తున్నారు. అమలాపురం రోడ్ దగ్గరకు వచ్చేసరికి రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి:పైన బంగాళ దుంపలు... లోపల గంజాయి బస్తాలు